ముద్ర,తెలంగాణ:- కేంద్ర కేబినెట్‌లో బీజేపీ తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌కి చోటు దక్కనుంది. బీజేపీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు బండి ప్రస్థానం ప్రశంసనీయం. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్‌లో ఆయన పనిచేశారు.కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత తొలి 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా గెలిచారు. 2014, 2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. వాటిలో ఓడిపోయారు.
ఎంపీగా.. 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు సార్లు విజయం సాధించారు. 2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. 2023లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2024లో జాతీయ కిసాన్ మోర్చ ఇన్‌ఛార్జిగా ఆయనను బీజేపీ నియమించింది.
సంబరాలు జరుపుకున్న కుటుంబ సభ్యులు
కేంద్ర కేబినెట్‌లో బీజేపీబండి సంజయ్‌కి చోటు దక్కడంతో కుటుంబ సభ్యుల సంబరాలు జరుపుకున్నారు. బండి సంజయ్ తల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ కోసం బండి సంజయ్ కృషి చేశారని, ఉన్నత స్థాయికి రావడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ బండి సంజయ్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లారని చెప్పారు.
బండి సంజయ్ బయోడేటా….
పుట్టిన తేదీ : 11-7-1971
తండ్రి : కీ.శే. బండి నర్సయ్య
తల్లి : శకుంతల.
అక్క :శైలజ
అన్నలు : బండి శ్రవణ్ కుమార్, బండి సంపత్ కుమార్
భార్య: బండి అపర్ణ, ఎస్.బి.ఐ. ఉద్యోగిని
పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్
కులము: (బి.సి-‘డిస)- మున్నూరుకాపు
ప్రస్తుత బాధ్యతలు : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి.