- సీనియర్ జర్నలిస్టు బంటు కృష్ణ
- ఘనంగా సీనియర్ పాత్రికేయులు, పారిశ్రామికవేత్త చలసాని శ్రీనివాస రావు జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసి తెలియజేసిన జర్నలిస్టు మిత్రులు
సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ పారిశ్రామికవేత్త చలసాని శ్రీనివాసరావు నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పేదలకు అండగా నిలుస్తున్నారని, అనాధలకు, అన్నార్తులను పలు సందర్భాల్లో ఆదుకుంటున్నారని టియుడబ్ల్యూజె ఐజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ జర్నలిస్టు బంటు కృష్ణ అన్నారు. సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సామాజిక సేవాతత్ములు,టియు డబ్ల్యు – ఐజెయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస రావు 57వ జన్మదిన వేడుకలను సోమవారం నాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఆయన నివాసంలో పలువురు జర్నలిస్టు మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చలసాని శ్రీనివాస రావు కు సూర్యాపేట జర్నలిస్టు మిత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బంటు కృష్ణ మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా అన్నా అని పిలిస్తే చాలు చలసాని ఆదుకుంటారని అన్నారు.
చలసాని ఫౌండేషన్ ద్వారా వారి కుమారుడు, ఎన్నారై చలసాని రాజీవ్ గణేష్ ఉత్సవాలకు వినాయకుని విగ్రహాలు అందజేస్తున్నారని, క్రికెట్ పోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎవరికీ ఏ ఆపద వచ్చి నా వెంటనే దాతృత్వ హృదయాన్ని చాటుకునే గొప్ప వ్యక్తిత్వం గల మహోన్నత జర్నలిస్టు శిఖరం శ్రీనివాసరావు అన్నారు. కష్టాల్లో ఉన్నానని ఎవరు సంప్రదించినా తన చేతనైన సహాయం చేస్తూ అందరినీ ఆదుకుంటూ తన ఉదారతను చలసాని చా టుకుంటున్నారని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదవారిని ఆదుకోవడంలో చలసాని ఫౌండేషన్ తరపున చలసాని శ్రీనివాసరావు, ఆయన కుమారుడు ఎన్ఆర్‌ఐ చలసాని రాజీవ్ ముందువరుసలో ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యు జె ఐజెయు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బత్తుల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి రెబ్బ విజయ్, సీనియర్ జర్నలిస్టు తల్లాడ చందన్, గన్నోజు జనార్ధన చారి, వెంకన్న, ప్రముఖ కార్టూనిస్ట్ పల్లె మణిబాబు, ఆర్టిస్ట్ ఆనంద్, ఎబిఎన్ మల్లేష్, రామకృష్ణ, కొండ్లె క్రర్ష్ణయ్య, జహీ రమేష్ ఫోటోగ్రాఫర్ బ్రహ్మచారి, , హెచ్ ఎంటీవి నాగరాజు, తాప్సి అనిల్, మామిడి శ్రవణ్, మామిడి శంకర్, ఆంధ్రజ్యోతి నాగరాజు, పడిసిరి వెంకట్, యోయో శంకర్, పాషా, వెంకటేష్, వలపట్ల రవి, కనుక రవి, కంఠం గౌడ్, పాషా, విక్రమ్ నాయక్ ఉన్నారు.