బీబీనగర్, ముద్ర ప్రతినిధి: ఆపదలో వున్న రోగికి రక్తదానం చేసి వారి ప్రాణాలు నిలపడంకన్నా గొప్ప సాయం ఇంకేమీ లేదని బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా అన్నారు. ఎయిమ్స్‌లో శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరిగింది. ఎయిమ్స్‌లోని ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, బ్లడ్ బ్యాంకు విభాగం ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ-క్విపోస్టర్, పోటీలను నిర్వహించారు, ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు, అక్కడికి హాజరైన వారిని చైతన్యపరిచారు. కార్యక్రమంలో స్వచ్ఛంద రక్తదాతల నమోదు. ఎయిమ్స్ కు వచ్చే స్వచ్ఛంద రక్తదాతలను, పోటీలలో విజేతలను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో అఫిషియేటింగ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) బిపిన్ వర్గీస్, డాక్టర్ అపర్ణ శర్మ, డాక్టర్ శ్యామల అయ్యర్ ఉన్నారు.