ముద్ర,తెలంగాణ:- తెలంగాణ లో ఎంబీఏ, షెడ్యూల్ఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్-2024 ప్రవేశ పరీక్షలను శుక్రవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటిస్తారు.ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
అయితే, ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో పూర్తిస్థాయి ఎంబీఏ, కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా ఐసెట్ ర్యాంక్ కార్డ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి- https://icet.tsche.ac.in/ హోమ్ పేజీలో ‘డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్’ లింక్‌పై క్లిక్ చేయండి. అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ‘వ్యూ ర్యాంక్ కార్డ్’ బటన్‌పై క్లిక్ చేయాలి.వివరాలు నమోదు చేయగానే కంప్యూటర్‌పై ఐసెట్ ర్యాంక్ కార్డు కనిపిస్తుంది. అభ్యర్థులు ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాగా, జూన్ 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్షల్లో ఐసెట్-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.