ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 3న ఆ నామినేషన్లను ప్రతిపాదించారు. 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎన్నికలను 12న నిర్వహించనుంది ఈసీ. అదే రోజున ప్రకటించనున్నారు. సీ.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్ పై అనర్హత వేటు పడడంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో తాజాగా ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.