ముద్ర,తెలంగాణ:- పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత. పోచారం శ్రీనివాస రెడ్డిని కలవాలని గేట్లు తోచుకుంటూ లోపటికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. అదే సమయంలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఉండటంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ఈ మేరకు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆందోళన జరిగింది. తమ పార్టీ నాయకుడి కలిసేందుకు అడ్డుకోవడం ఏంటి? అని సుమన్ ప్రశ్నించారు.