ముద్ర,సెంట్రల్ డెస్క్:-అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. దండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు రూపొందించాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. పది నెలల క్రితం సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. జాబ్ ప్రయత్నంలో ఉండగానే.. సౌత్ ఆర్కెన్సాస్ లోని ఓ సూపర్ మార్కెట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ సూపర్ మార్కెట్ కౌంటర్ లో ఉండగా.. ఓ దుండగుడు వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో గోపీకృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
కాల్పులు అనంతరం దుండగుడు సూపర్ మార్కెట్ లోని వస్తువులను తీసుకొని పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడిఉన్న గోపీకృష్ణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గోపీకృష్ణ కనిపించాడు. ఈ సమాచారం తెలుసుకున్న గోపీకృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికాలోని తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలాఉంటే.. దుకాణం లోపలేకాక పార్కింగ్ స్థలంలోను దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. కాల్పులకు సంబంధించిన సీసీ ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి.