- ఆన్‌లైన్‌లో బస్ పాస్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- వివరాలను వెల్లడించిన టీజీ ఆర్టీసీ
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల గడువు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) పొడిగించింది. ప్రస్తుత బస్ పాస్‌ల గడువు ఈ నెల 30 నుండి ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల జారీ చేసింది. ఈ మేరకు బస్ పాస్‌ల గడువును మూడు నెలల పాటు టీజీఎస్‌ఆర్టీసీ పొడిగించింది.
అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి కనిపిస్తుంది. కాలపరిమితి పొడిగించిన ఈ బస్సు పాస్‌లను గతంలో మాదిరిగానే https://tgsrtcpass.com/journalist.do?category=ఫ్రెష్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లో జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో, అక్రిడిటేషన్ కార్డులను విధిగా అప్‌లోడ్ చేయాలి. బస్ పాస్ కలెక్షన్ సెంటర్‌నూ ఎంపికచేసుకోవాలి. ఈ దరఖాస్తులను సమాచారం, పౌరసంబంధాల శాఖ ఆన్‌లైన్‌లో దృవీకరించిన తర్వాత జర్నలిస్టులకు బస్ పాస్‌లను టీజీఎస్ఆర్టీసీ జారీ చేస్తుంది.