గరిడేపల్లి, ముద్ర న్యూస్: గరిడేపల్లి మండలం కీత వారి గూడెం పెట్రోల్ బంక్ వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రైవైట్ ట్రావెల్ బస్సు, లారీ డీ సంఘటనలో 15 మంది గాయాలు కాగా అందులో ఇద్దరికి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. 108 ద్వారా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. షిరిడి నుండి మిర్యాలగూడ మీదుగా మైలవరం పోతుండగా ప్రమాదం జరిగింది క్షతగాత్రులు కూడా విజయనగర వాసులు, బస్సు డ్రైవర్ కి, పక్కన ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు వెళ్లినట్టుగా చెప్పారు.
షిరిడి దర్శనంతో పాటు మధ్యలో ఉన్న అన్ని దేవాలయాలను చూసుకుంటూ 8 రోజులుగా ప్రయాణిస్తున్న యాత్రికులకు మిర్యాలగూడ మీదుగా మైలవరం వెళుతుండగా గరిడేపల్లి మండలం కీతవారి గూడెం వద్ద లారీ బస్సు ఎదురుగా ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ కి, సపోర్ట్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా 13 మంది డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.