ముద్ర, తెలంగాణ బ్యూరో : సిద్ధిపేట నిర్మాణం ప్రాజెక్టులు నీళ్ళు లేక అడుగంటిపోతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ. హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక లేఖను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాశారు. సిద్ధిపేటసాగర్ అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లో నీళ్ళు లేక అడుగంటిపోయే పరిస్థితికి వచ్చాయని లేఖలో ఆయన పేర్కొన్నారు.
కానీ ఆగస్టు మాసంలో ఆయా నీటి నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం వాటిలో చాల తక్కువ నీరు ఉందని చెప్పారు. సకాలంలో వర్షాలు పడక తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులు పంటలు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని పేర్కొన్నారు. మిడ్ మానేరు నీటిని పంపేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయవలసి ఉంది.