- ప్రభుత్వానికి సోమనాథ కళా పీఠం విజ్ఞప్తి
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం మీడియాతో సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, ఇతర సభ్యులు కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు ఇటీవల శాసనసభలో ప్రస్తావించారని పేర్కొన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమం నాటి నుంచీ తెలంగాణ వాదులు ఈ విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని బలంగా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చటానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకోగలరని పీఠం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరును పాలమూరు విశ్వవిద్యాలయానికి పెట్టేందుకు పీఠం అందిస్తున్నారు. మీడియా సమావేశంలో సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక గౌరవ సలహాదారు వీరమనేని వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఇమ్మడి దామోదర్, కార్యదర్శులు జక్కుల రవీందర్, మామిండ్ల రమేశ్ రాజా, కోశాధికారి రాపాక విజయ్, కార్యవర్గ సభ్యులు గుమ్మడిరాజుల సాంబయ్య, గూడూరు లెనిన్, డాక్టర్ రాపోలు వెంకటేశ్వరమ్మలు, , బజ్జూరి వేణుగోపాల్, మేరుగు మధుసూదన్ ఉంటుంది.