- కమిటీ చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సభ్యులుగా మంత్రులు తుమ్మల, జూపల్లి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ముద్ర, తెలంగాణ బ్యూరో:-రాష్ట్రంలో రిజర్వాయర్ల నిల్వ, సామర్థ్యం, పునరుద్ధరణ వంటి ఇతర రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం తగు ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి చైర్మన్ గా భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉంటారు.
ఈ కమిటీ కన్వీనర్, సభ్యుడిగా ఇరిగేషన్ శాఖ కార్యదర్శిని నియమించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరులు, నదుల అభివృద్ధి గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ప్రేమ వర్క్ పై పద్ధతులు, మార్గదర్శకాలను అధ్యయనం, సిఫార్సు చేయడానికి ఈ మంత్రి వర్గ ఉప సంఘం పని చేస్తుంది.