- శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘటన
ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికారులు కళ్లుగప్పి దుబాయ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణీకుడు పట్టుబడ్డాడు. ఈకె-528 విమానంలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి బూట్లు, వీపుకు తగిలించుకునే లగేజీ బ్యాగ్‌ను అధికారులు స్కాన్ చేయగా 1390 గ్రామాల విదేశీ బంగారం బయటపడింది. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్డీ ఇంటెలిజెన్స్ (ఆర్‌ఐ) అధికారులు తీసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ. 1.06 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. . కస్టమ్స్ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు