- జూనియర్ డాక్టర్ ను రేప్ చేసి హత్య చేయడం అత్యంత పాశవికం
- ఉదృతం చేసిన జూనియర్ డాక్టర్ల సమ్మె
- పట్టణంలో భారీ ర్యాలీ
- న్యాయం జరిగే వరకు పోరాడుతాం
సిద్దిపేట, ముద్రణ ప్రతినిధి : బంగ్లాదేశ్, గాజాలో జరుగుతున్న దారుణాల పై మాట్లాడే మేధావులు కోల్పోయిన కొతలోని మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ పై అత్యంత పాశవికంగా జరిగిన రేప్, హత్య పై ఎందుకు లేడని జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 9వ తేదీ అర్ద రాత్రి కలకత్తెలోని ఆర్జికర్ హస్పటల్, మెడికల్ కాలేజీలో ట్రైనీ లేడి డాక్టర్ హత్యాచారం ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
కారకులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా జూడా లు మాట్లాడుతూ ప్రాణాలు కాపాడే డాక్టర్ లకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల్లో రెస్ట్ రూమ్స్, సెక్యూరిటీ లేదని ఇలా ఉంటే డాక్టర్లు ఎలా డ్యూటీలు చేస్తారని ప్రశ్నించారు. జరిగి ఉన్న రోజులు అయినా సంఘాలు కానీ, మేధావులు, రాజకీయ నాయకులు, కనీసం ప్రజలు కూడా నోరు తెరవడం లేదు.
అత్యంత పాశవికంగా రేప్ చేసిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లని ముట్టుకోవాలంటే భయం ఏర్పడేలా చట్టాలు తేవాలని అన్నారు. అంతకు ముందు మెడికల్ కాలశాల అనుబంధ ఆసుపత్రి నుండి మొదలైన ర్యాలీ ముస్తాబాద్ చౌరస్తా అంబేద్కర్ సర్కిల్, పాత బస్టాండ్ వరకు కొనసాగింది.
కొంతమంది డాక్టర్ జూడాలు కలిసి ప్రతి చౌరస్తా వద్ద చిన్న హత్య పై ప్రదర్శన జరిగింది. అలాగే మహిళ జూనియర్ డాక్టర్స్, మెడికల్ విద్యార్థులకు పప్పర్ స్ప్రే లను ఏర్పాటు. కార్యక్రమంలో జూనియర్ డాక్టర్స్ అజయ్, ధరణి, మెడికల్ విద్యార్థులు ఉన్నారు.