వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత సువెన్ లైఫ్ సైన్సెస్ (సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్) సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళం అందించింది. సంస్థ చైర్మన్ & సీఈవో వెంకట్ జాస్తి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కును ఏర్పాటు చేసారు. సహాయ కార్యక్రమాల కోసం ఉదారతను చాటుకున్న వారిని ముఖ్యమంత్రి గారు అభినందించారు.