- గిన్నిస్ బుక్‌లో ప్లేస్
- అత్యధిక డ్యాన్స్ స్టెప్పులు
ముద్ర, సినిమా ప్రతినిధి : కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. చిరంజీవి తన 45 ఏళ్ల కెరీర్‌లో 156 సినిమాల్లో నటించి, 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేశారు. మరే నటుడూ ఇన్ని డ్యాన్స్ స్టెప్పులు వేసిన దాఖలాలు లేవు. 1978 సెప్టెంబరు 22న తన సినీ కెరీర్ ప్రారంభించిన చిరంజీవి.. భారతీయ సినీ చరిత్రలో మరెవరూ నటుడికి సాధ్యం కాని రీతిలో అత్యధిక స్టెప్పులతో గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేశారు. భాగంగా ఆదివారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధులు హాజరైన చిరంజీవికి రికార్డు. చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతులమీదుగా అందుకున్నారు.
తగ్గని ఇమేజ్
సినీ ఇండస్ట్రీలో ఎవరైనా చెప్పుకునేది.. చిరంజీవిలా డ్యాన్స్ చేస్తే, ఆయనలా నటించాలని, ఆయనలా స్వయంకృషితో ఎదగొచ్చనే ధైర్యంతో వచ్చామనే సమాధానాలే వినిపిస్తున్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీఇండస్ట్రీలో రికార్డులకు కేరాఫ్ అడ్రస్. సినిమాలకు పదేళ్లు దూరంగా ఉన్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గని స్టార్ చిరంజీవి. సినీరంగంలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహారం, నటనకుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన మధ్యతరగతి కుటుంబంలో కొణిదెల శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి. అలా మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నప్పుడు ‘పునాదిరాళ్లు’ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత వెనక్కితిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కావనే ‘నటన అంటే కమల్ హాసన్, స్టైల్ అంటే రజనీకాంత్ ఈ రెండు ఉన్న కథానాయకుడు మెగాస్టార్!’ అనేంతలా ఎదిగారు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ లక్షలాదిమంది ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. 90లో డ్యాన్స్ అంటే చిరంజీవిదే. సినిమాల్లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆడియన్స్‌ను అలరించేవారు. యాక్షన్ సీన్స్‌తో మాస్ ప్రేక్షకులను కూడా తనవైపు తిప్పుకున్నారు. ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లో తనదైన మార్క్ చూపించి ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పటికే రికార్డులు
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్ లీడర్’ వంచి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ పెంచారు. ఈ వంటినే మెగాస్టార్ అనేక రికార్డులు సృష్టించారు. ‘ఇంద్ర’, ‘ఠాగూర్’, ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’, ‘స్టాలిన్’ సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నారు. ఇక 2007 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లోనూ జోరు పెంచారు. దాదాపు 10ఏళ్ల తర్వాత మెగాస్టార్ ‘ఖైదీ నెం.150’ సినిమాతో బిగ్ స్క్రీన్‌పై సందడి చేశారు. రీఎంట్రీలో తొలి సినిమాతోనే పలు రికార్డులు బద్దలుకొట్టి, ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’తో సెకండ్ హాఫ్‌లోనూ జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవిని 2006లో అప్పటి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ని కూడా అందుకున్నారు. 2016లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. ‘స్వయం కృషి’, ‘ఆపద్బాంధవుడు’, ‘ఇంద్ర’ సినిమాలకుగానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఇక 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా దక్కింది. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.
గిన్నీస్ రికార్డులో ఇప్పుడు..!
తాజాగా చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారతీయ సినీ చరిత్రలో ఒక అపురూపమైన నటుడు అని గుర్తిస్తూ ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సముచిత స్థానం కల్పించింది. తన సుదీర్ఘ సినీ కెరీర్ లో 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్స్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు నమోదైంది. ఆదివారం హైదరాబాదులోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకటన కార్యక్రమం జరిగింది. ఈ పత్రిక చిరంజీవి, గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, టాలీవుడ్ ప్రముఖులు, మెగా కుటుంబ సభ్యులు, ఇతర రంగాలకు చెందినవారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ ను చిరంజీవి అందుకున్నారు.
అందుకే గిన్నీస్ రికార్డు.. : చిరంజీవి
తాజాగా గిన్నీస్ రికార్డు అందుకున్న చిరంజీవి మాట్లాడుతూ, తాను ఎదురు చూడని గొప్ప గౌరవం ఇది అని అభివర్ణించారు. నటన మీద కన్నా డాన్స్ మీద నాకున్న ఇష్టమే ఈ గిన్నిస్ అవార్డు రావడానికి కారణం అనుకుంటా అని వివరించారు. ఇదే వేదికపై డ్యాన్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు అందరితో షేర్ చేసుకున్నాడు. తాను ఊహించనిది ఈ ఈవెంట్ ఇంత గ్లామర్‌గా మెమెరబుల్‌గా ఉందంటే కారణం తన మిత్రుడు అమీర్‌ఖాన్ అని ధన్యవాదాలు చెప్పారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తానెప్పుడూ ఊహించనిదని, గిన్నీస్ బుక్‌కు మనకు ఏం సంబంధమనే ఆలోచన ఉందని, తనకు కూడా అలాంటి ఆలోచన లేదని, అలాంటిది.. ఎదురుచూడనట్వంటి గొప్పతనాన్ని తన సినీ ప్రస్థానంలో తారసపడినందుకు ఆ భగవంతుడికి.. దానికి కారణభూతులైన నా దర్శకనిర్మాతలు, అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటానని చిరంజీవి చెప్పారు.
“నాకు నటన కంటే కూడా డ్యాన్స్ మీద ఉన్న ఆసక్తి ఈ రోజు ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకనిపిస్తుంది. ఎందుకంటే నేను నటనకు శ్రీకారం చుట్టేకంటే ముందు డ్యాన్స్‌కు ఓనమాలు దిద్దానేమోననిపిస్తూ ఉంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉన్నవాళ్లను ఎంటర్‌టైన్ చేయడం కోసం అప్పట్లో వివిధ భారతి, రేడియో సిలోన్ (శ్రీలంక రేడియో స్టేషన్) కానీ.. వీటిలో వచ్చే తెలుగు పాటలు మాకు ఇన్‌స్పిరేషన్. అప్పట్లో ఆర్థికంగా గ్రామ్‌ఫోన్, టేప్ రికార్డర్ కానీ ఉండే పరిస్థితి లేదు. ఒక్కోసారి రేడియోలో పాటలు ఎప్పుడొస్తాయని అందరూ ఎదురుచూసేవారు. రాగానే శంకర్ బాబును పిలవండి.. డ్యాన్స్ చేస్తాడు.. మనల్ని అలరిస్తాడని వాళ్లంతా ఉత్సాహంగా ఉంటే.. నేను ప్రోత్సాహంగా తీసుకొని డ్యాన్స్ చేస్తుండేవాడిని” అంటూ చిరంజీవి గద్గదస్వరంతో చెప్పారు.