విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జాతీయ రహదారి పక్కన కొయ్యలగూడెం వద్ద ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉంది. ఈ హైదరాబాద్ వైపు వెళ్లేందుకు లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి గాయాలు అయ్యాయి.