సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10న ముగియనుంది. దాంతో తన తరువాత సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించారు. సుప్రీంకోర్టులో చంద్రచూడ్ తర్వాత సీనియర్ జడ్జిగా ఖన్నా ఉన్నారు. న్యాయమూర్తి చంద్రచూడ్‌లను కేంద్రం ఆమోదిస్తే 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. నియమితులైతే 2025 మే 13 వరకు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవిలో ఉంటారు. 2019లో ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఖన్నా పదోన్నతి పొందారు.
నిబంధనల ప్రకారం డీవై చంద్రచూడ్ ప్రతిపాదనను న్యాయశాఖ పరిశీలించి ప్రధానమంత్రికి పంపింది. ప్రధాని మోదీ ఆమోదం తరువాత రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. రాష్ట్రపతి ఆమోదముద్రతో తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ఖరారవుతుంది. 2022 నవంబర్ 9వ తేదీన ఛీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కాలం డీవై చంద్రచూడ్ ఎక్కువ ఈ పదవిలో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్ డివై చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్‌గా ఉన్నారు.