- ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క మంచి కార్యక్రమం కూడా తీసుకోలేదు
- హైడ్రా కూల్చివేతలతో మరింత ఆగం చేశారు
- నిర్మాణ రంగం పూర్తిగా కుదేలవుతుంది
- పరిస్థితి ఇలాగే ఉంటే రియల్ ఎస్టేట్ మాటాస్
- బిల్డర్ల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రియల్ రంగం పూర్తిగా చితికిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కుదేలు అవుతున్న ఈ రంగాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క మంచిదని కూడా చేపట్టకపోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. దీనికి తోడు హైడ్రాను తీసుకొచ్చి…నిర్మాణ రంగాన్ని బుల్ డోజర్ తో అణిచివేస్తోందన్నారు. దీనితో రియల్లు అంతా పక్క చూపులు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మటాష్ కానుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మంగళవారం శ్రీనగర్ కాలనీలో రాష్ట్ర రియల్టర్స్ ఫోరమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ,కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసమే రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిందని. దీనితో రియల్ రంగంలోని ప్రాజెక్ట్ లకు లేక్ వ్యూ అని పేరు పెట్టాలంటే భయపడుతున్నారు. పర్మిషన్ కావాలంటే అది గాలిలో దీపంలా అయ్యి ఉండేది. సీఎం రేవంత్ ఉన్న ప్రాజెక్ట్ లు రద్దు చేస్తున్నాడని. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కొత్త ప్రాజెక్టు. డబ్బుల కోసం బిల్డర్లను బెదిరిస్తున్నాడన్నారు. రేవంత్ మూలంగా మార్కెట్ లో ఎవరికీ డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు.. నేను చెప్పేవన్నీ నిజాలు అని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. మా మీద కోపంతో వేల మంది కడుపులు కొట్టొద్దు అని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గింపు ప్రచారం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రాన్ని నడిపే సమర్థత మీకు ఉందా…. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారన్నారు.హిందూ, ముస్లిం పంచాయితీ, నక్సలిజం, భూముల ధరలు పడిపోతాయంటూ ప్రచారాలు చేశారు. కానీ కేసీఆర్ వాటిని పటాపంచలు చేస్తూ పదేళ్ల ప్రగతి పాలన అందించారు. దీని కారణంగానే రాష్ట్రంలోని మారమూల గ్రామాల్లోని భూములకు సైతం మంచి ధర పలికింది.