- ముందుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ జెడ్పిటిసి పాలకుర్తి రాజయ్య సతీమణి పేరు ప్రకటన
- పాలకుర్తి రాజయ్య సతీమణికి మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వడానికి ఎమ్మెల్యే మందుల సామేల్ సుముఖంగా లేరా?
- మార్కెట్ చైర్మన్ పదవి ఇస్తానని జిల్లా వెల్లడించిన రాజయ్య ఇప్పటికే ఉపముఖ్యమంత్రి తో సహా మంత్రులను వ్యవసాయ శాఖ మంత్రులను కలసి తన ఆవేదన వెల్లబోసుకున్న రాజయ్య
- రాజయ్య సతీమణికే మార్కెట్ చైర్మన్ పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారా?
- నియోజకవర్గంలోని మెజార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాజయ్యకు మద్దతిస్తున్నారా?
- ప్రతిష్టాత్మక తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రాజకీయ ప్రతిష్టంబన మధ్య ఎవరికి దక్కేను!
తుంగతుర్తి ముద్ర :- ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లాలో ప్రతిష్టాత్మకమైన తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలో అనే సందిగ్ధంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. తుంగతు నియోజకవర్గం లోని మిగిలిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవికి ఎవరి పేరు ప్రకటించలేదు. ముందుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని అనేక కష్టనష్టాల పాలై పార్టీని ముందుకు నడిపిస్తూ కృషిచేసిన తిరుమలగిరి మండలం గుండెపురి వాస్తవ్యుడు పాలకుర్తి రాజయ్య సతీమణి పేరును ప్రకటించారు. అంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ రాజయ్య సతీమణికి మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి. దీంతో తనకు ఇస్తానన్న మార్కెట్ చైర్మన్ పదవి ఎందుకు ఇవ్వరని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసిన రాజయ్యకు ఎమ్మెల్యే వద్ద చేదు అనుభవమే ఎదురైనట్లు సమాచారం .దీంతో ఆగ్రహించిన రాజయ్య ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు శాఖా మంత్రి జిల్లా మంత్రులను పిసిసి అధ్యక్షునితో సహా అందరినీ కలిసి తన గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం రాజయ్యకు తప్పకుండా వ్యవసాయ మార్కెట్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు సైతం రాజయ్య సతీమణి మార్కెట్ చైర్మన్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు రాష్ట్ర రైతు కమీషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ సైతం పాలకుర్తి రాజయ్య కుటుంబానికి మార్కెట్ ఛైర్మన్ పదవిని అందించారు. ఇప్పటికే రాజయ్య నియోజకవర్గం సీనియర్ నాయకులు అందర్నీ కలిసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల కొద్ది రోజుల క్రితమే పిసిసి అధ్యక్షుడిని సైతం కలిసిన రాజయ్యకు గట్టి హామీ లభించినట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొత్తగా పార్టీలోకి వచ్చిన రెండు వర్గాల్లో చీలిపోయి బాహా బాహీ కి దిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అరవపల్లి మండలంలో ఏకంగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ధరూర్ యోగానందచారి తిరుగుబాటు జెండా ఎగురవేసి ఎమ్మెల్యే అనుయాయులకు వ్యతిరేకంగా పార్టీ అధిష్టానానికి ఇప్పటికే పలు దఫాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీనియర్ నాయకుడు పాలకుర్తి రాజయ్య తనకు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని ప్రకటించి తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. సీనియర్లను ఇలాగే అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద రాజయ్య అంటున్నట్లు తెలుస్తోంది.
తుంగతుర్తి నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ కంచుకోటగా ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్దిమంది నాడు నాయకత్వం వహించిన దామోదర్ రెడ్డి వెంట ఉండి పార్టీ అభివృద్ధితో పాటు సుమారు 20 మంది అధికారంలో ఉండేలా కృషి చేయడం జరిగింది. ప్రస్తుతం కొత్తగా వచ్చిన వారికి అందలం ఎక్కిస్తున్నారని పాతవారిని పక్కకి పెడతారు సీనియర్ నాయకుల మాటగా తెలుస్తుంది. ఇన్ని రకాల సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికి వస్తుందా లేక కాంగ్రెస్ అధిష్టానం సీనియర్‌టీకి ప్రాధాన్యత ఇచ్చి ఆది నుండి పార్టీలో కొనసాగుతున్న వారికి ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఉన్న మార్కెట్ చైర్మన్ పదవులలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది బీసీ సంఘం నాయకుల మాట. అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజయ్యకు ఆ పదవి ఇవ్వడం సమంజసం గానే ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ సీనియర్ నాయకుల మాటగా తెలుస్తుంది. ఏమైనా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి పాలకుర్తి రాజయ్య సతీమణి దక్కుతుందా? లేక మరో వ్యక్తిని వరిస్తుందా? వేచి చూడాల్సిందే.