- హైకోర్టు ఉత్తర్వులతో తేటతెల్లం
- సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు
- అసెంబ్లీలో చర్చ పెట్టాలని తామే డిమాండ్ చేశాం
- ఒప్పందం ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు
- ఈ…రేసుతో ప్రభుత్వానికి రూ. 700 కోట్ల లాభం వచ్చింది
- ఇందులో కేటీఆర్ చేసిన తప్పేంటీ
- ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ..రేసును హైదరాబాదుకు తెచ్చిండు
- హైదరాబాద్ ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్ మెంట్స్ కి డెస్టినేషన్ గా మార్చాలనుకున్నాడు
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఫార్ములా ఈ…రేసుపై కేటీఆర్ పై నమోదు అయిన ఏసీబీ కేసు ఉత్త డొల్ల అని మాజీ మంత్రి హరీశ్ రావు ఉన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో ఇది తేట తెల్లం అయింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్‌ను అరెస్టు చేయడాన్ని తిరస్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తొలి అడుగులోనే ఆయన నైతిక విజయం సాధించారు.
శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, ఈ అంశంపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారు. గోబెల్స్ ప్రచారం చేశారు..ఈ.. రేసింగ్ మీద సభలో చర్చ జరపాలని తామే అడిగామన్నారు. ప్రత్యేకంగా స్పీకర్ ను కలిసి చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే సభ నుంచి మిమ్మల్ని బయటకు పంపి చర్చ కొనసాగించారని. ఈ సందర్భంగాఈ..రేసులో రూ. 600 కోట్ల అవినీతి అంటూ సీఎం అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
45 లక్షల పౌండ్లు అంటే…. సుమారు రూ .47 కోట్లు అన్నారు. కానీ సీఎం రూ. 600 కోట్ల నష్టమని ఎలా చెబుతారని ప్రశ్నించారు.వాస్తవానికి ఈ రేసు వల్ల రాష్ట్రానికి రూ. 700 కోట్ల లాభం జరిగింది. ఈ…రేసుతో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి దేశ వ్యాప్తంగా పెరిగింది. రూ.42 కోట్లతో తమిళనాడులో ఫార్ములా 4 నిర్వహించగా, ఉత్తర ప్రదేశ్ రూ, 1700 కోట్లతో ఫార్ములా వన్ నిర్వహించింది. రూ. 103 కోట్లతో చంద్రబాబు 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహిస్తున్నారు, మీ కాంగ్రెస్ ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ రూ. 70వేల కోట్లతో నిర్వహించారు.
అందుకే ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ.. రేసును కేటీఆర్ హైదరాబాదుకు తెచ్చిండన్నాడు.గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్ మెంట్స్ కి డెస్టినేషన్ గా మార్చాలనుకున్నాడని….ఇదికేటీఆర్ తప్పా? అని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రేవంత్… ఏదో శోధించినట్లు డైవర్షన్ పాలిటిక్స్ నిలిచిపోయాయి. ఆ డైవర్షన్ లో భాగమే.. కేటీఆర్ మీద పెట్టిన కేసు అని అన్నారు.
ఆయనకు విజన్…. విజ్ డమ్ ఆరోగ్యం లేదు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ ప్రతిష్ఠ దిగజారే పరిస్థితి వచ్చింది. నగరంలో ఇంటర్ నేషనల్ రేసు మూడేండ్లు జరగాల్సి ఉంటే…. దాన్ని మధ్యంతరంగా రద్దు చేయడం సిగ్గుచేటన్నారు.అప్పులు, అప్పులు అని దివ్యంగా వెలుగు చూస్తున్న రాష్ట్రాన్ని దివాళా రాష్ట్రం అన్నాడని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ పిచ్చి చేష్టలు మానుకుని…. రాష్ట్రం కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు.