- కంటే 45 శాతం పెరిగిన ఎఫ్ ఐఆర్ లు
- 13 శాతం తగ్గిన మర్డర్లు, అటెంప్ట్ మర్డర్లు
- కిడ్నాప్ కేసుల్లో 88 శాతం పెరుగుదల
- 67 శాతం పెరిగిన ఆస్తి కేసులు
- 4042 సైబర్ క్రైమ్ లు నమోదు
- వచ్చే ఏడాది రౌడీ షీటర్లు, డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం
- ”2024 వార్షిక నేర నివేదిక ఆనంద” విడుదల చేసిన సీపీ సీవీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 35,944 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏర్పాటు చేశారు. ఈసారి 45 శాతం ఎఫ్‌ఐఆర్‌లు పెరిగాయి. ప్రతి చిన్న నేరానికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వలన కేసులు సంఖ్య పెరిగిపోయింది. పెగిరిన కేసుల్లో సెల్ ఫోన్, బైక్, ఆటో, కారు వంటి చిన్నచిన్న చోరీలు, యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ”2024 వార్షిక నేర నివేదిక”ను కమీషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఈ ఏడాది 36 రకాల సైబర్ నేతలను చూశామన్నారు. డిజిటల్ అరెస్టుల కేసులు ఎక్కుగా నమోదు అవుతున్నాయని, మొత్తం 4024 సైబర్ క్రైమ్ లు నమోదు చేశామన్నారు. 500 పైగా సైబర్ క్రిమినల్స్ ను అరెస్టు చేశామన్నారు. సైబర్ నేరాల్లో రూ.237 కోట్లు బాధితులు పోగొట్టుకోగా, రూ.42 కోట్లు రికవరీ చేశామన్నారు. సైబర్ నేరాలన్నీ బ్యాంక్ సిష్టం ద్వారా జరుగుతున్నట్లు విచారణలో తాము కనుగొన్నామని అన్నారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్ళతో లింక్‌లు తేలిన యాక్సిస్, ఆర్ బీఎల్ బ్యాంకుల మేనేజర్లను అరెస్టు చేశామన్నారు. నగరంలో ముత్యాలమ్మ ఘటన తర్వాత రోడ్లపై తిరుగుతున్న ప్లాటర్ లైన్ పీపుల్స్ పై సర్వే నిర్వహించారు. లోపల భాగంగా నిరాశ్రయులను పరిసర ప్రాంతాలకు తరలించామన్నారు. మర్డర్లు, అటెంప్ట్ మర్డర్ కేసులు 13 శాతం తగ్గాయి. కిడ్నాప్ కేసుల్లో 88 శాతం పెరుగుదల కనిపించింది. ఆస్తులకు సంబంధించిన కేసుల్లో 67 శాతం పెరుగుదల.
వచ్చే ఏడాదిలో రౌడీ షీటర్లు, డ్రగ్స్ విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం ఫుట్ పాత్ ల ఆక్రమం లేనిదేనని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు మేరకు టౌన్ వైడింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్గనైజ్డు క్రైమ్స్ ను కట్టడి చేయడంలో టాస్క్ ఫోర్స్ ముందు ఉంది. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ మేనేజ్‌మెంట్ మెంట్ కోసం డ్రోన్స్ వినియోగిస్తామన్నారు. ఈ ఏడాది ఏసీబీ కేసులో 30 మంది పోలీసులు లంచం తీసుకుంటూ సస్పెండ్ అయ్యారన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల విధులను పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవాల అనంతరం సౌండ్ పొల్యూషన్ పై చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అన్ని పండుగలు ప్రశాంతంగా ముగిశాయని, హోంగార్డు నుంచి సీపీ వరకు అందరు కష్టపడ్డారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సీపీ ఆనంద్ పేర్కొన్నారు.