- అయినా తెలంగాణ భక్తుల పట్ల టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
- టీటీడీ తరపున తెలంగాణలో ధర్మప్రచార, నిధులు కేటాయించాలి
- సమైక్య రాష్ట్రంలో శ్రీశైలం కలిసి ఉంటే.. ప్రత్యేక రాష్ట్రంలో విడిపోవడం దురదృష్టకరం
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి తిరుమలకు అధిక భక్తులు, అధిక రాబడి వస్తుందని బాంబ్ పేల్చారు. శ్రీశైలం మల్లికకార్ణునస్వామి స్వామి దయతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ప్రభుత్వాలకు బలాన్ని, ధైర్యాన్ని, ఆర్థిక బలాన్ని ఇచ్చి నడిపించాలని వేడుకుంటున్నట్లు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏపీ కలిసి ఉన్నప్పుడు శ్రీశైలం తమ గుడిగా ఉండేదన్నారు. మన దురదృష్టం కొద్దీ రాష్ట్రం విడిపోవడంతో శ్రీశైలాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అయిన వారికి మలన్నపై భక్తి ఎక్కువ అని చెప్పారు.
ఏపీలో టీటీడీ నుంచి ఇబ్బంది ఉందన్న మంత్రి.. తెలంగాణ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి రూపకల్పన చేశారని భక్తులు గతంలో తిరుమలలో పద్ధతులు, నియమాలు ఉండేవని ఇప్పుడు కూడా తెలంగాణకు అవి అందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం దానిపై కమిటీ వేసి. గతంలో తెలంగాణకు టీటీడీ నుంచి కళ్యాణ మండపాలు ఆలయ అభివృద్ధికి నిధులు వచ్చేవి. అలానే ఇప్పుడు కూడా రావాలని కోరుతున్నామన్నారు. తెలంగాణలో ప్రాచీనాలయాలు ఎక్కువగా గ్రామ గ్రామాన కళ్యాణ మండపాలు అడుగంటాయి. టిటిడి ఒప్పుకొని ప్రత్యేకమైన నమ్మకాన్ని కలిగించి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.