మల్యాల, ముద్ర:మాకు ఇన్ని రోజులు పాఠాలు బోధించిన టీచర్లే కావాలి. వేరే వారు వద్దు అని జగిత్యాల జిల్లా మల్యాల కేజీబీవీ విద్యార్థులు శుక్రవారం హాస్టల్ లో నిరసన తెలిపారు. రాత్రి వేళలో పాఠశాలలో ఏఎన్ఎం, సెక్యూరిటీ ఉంటున్నారు.
తమను చూసేందుకు టీచర్ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. సమగ్ర శిక్ష ద్వారా పని చేస్తున్న కేజీబీవీ సిబ్బంది తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ 15 రోజులుగా సమ్మె చేశారు. విద్యార్థులకు విద్యాబోధన కుంటు పడకుండా ఉండేందుకు జిల్లా విద్యా అధికారి ద్వారా మండల విద్యాధికారి జయసింహ ప్రత్యామ్నాయరావు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు మహిళా ఉపాధ్యాయులకు కేజీబీవీలకు తాత్కాలిక విద్యా బోధన నిర్వహించడం చూశారు.