- విద్యార్థినిల టాయిలెట్లలో మొబైల్ తో వీడియోలు
- మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన
- ఆందోళనకు దిగిన విద్యార్థులు
- మల్లారెడ్డి కాలేజీ ఘటనపై ప్రభుత్వం సీరియస్
- కాలేజీకి నోటీసు ఇచ్చేందుకు రెడీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్రంలో వరస దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వాటికి కేంద్రాలుగా విద్యాసంస్థలు అవుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు…ఎలాంటి చెడు వార్తను వినాల్సి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘనతలో రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక విద్యాసంస్థల్లో చేటుచూసుకుంటున్నాయి. దీంతో విద్య సంస్థలకు విద్యార్థులను పంపడానికే వారి తల్లి దండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు రోజుల క్రితం సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో ఘటన మరువకముందే శనివారం మరో దారుణ ఘటన జరిగింది. తాజాగా మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో వీడియో రికార్డుల ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూం వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిగే చర్యలు హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కావాలనే నవీన్ అనే యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా జరగడం రెండోసారి, ఇంతకుముందు కూడా ఒకసారి ఇలా జరుగుతోంది. మొదటిసారి ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన క్షణంలోనే పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో విద్యార్థులు భారీగా తరలివచ్చారు. దీంతో మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలేజ్ గర్ల్స్ హాస్టల్ లో వీడియోలు ఎలా తీస్తారని.. నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. విద్యార్థులు అందరూ వెళ్లి కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సీఎంఆర్ కాలేజీపై సర్కారు సీరియస్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీపై రాష్ట్ర సర్కార్ సీరియస్ గా ఉంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని ఇటీవల విద్యార్థుల ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై అధికారుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. హాస్టల్ నిర్వహణ సరిగా లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ కమిటీ రిపోర్టు సోమవారం నాడు ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా మల్లారెడ్డి కాలేజీపై తీసుకోబడింది. అవసరం అయితే కాలేజీని సీజ్ చేసే అవకాశం కూడా ఉందన్న చర్చ సాగుతోంది.
ప్రస్తుతం మల్లారెడ్డి కాలేజీని పోలీసులతో మూడు రోజుల పాటు క్లోజ్ చేసింది యాజమాన్యం. సోమవారం కాలేజీ తిరిగి తెరుచుకోనుంది. కాలేజీ తెరిచిన తర్వాత మళ్లీ ఆందోళనలు జరిగాయి విద్యార్థులు, స్టూడెంట్స్ యూనియన్ లీడర్లు హెచ్చరిస్తున్నారు. దీనితో సోమవారం ఏం జరగనుందనే అంశంపై ఉత్కంఠ ప్రకటన. క్గాగా మహిళా కమిషన్ కూడా కేసును సుమోటోగా తీసుకుంది. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కూడా చాలా సీరియస్‌గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ సిబ్బందిని విచారిస్తున్నారు. వారి దగ్గర నుంచి తీసుకున్న ఫోన్లలో వీడియోలను చూస్తున్నారు. వాటి ఆధారంగా మల్లారెడ్డి కాలేజీపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.