- క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి …. జిల్లా కలెక్టర్ ఆదర్స్ సురభి
ముద్ర ప్రతినిధి, వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అదేవిధంగా క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి నిర్వహిస్తున్నారు. 20 వరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ప్రభుత్వ నేపథ్యంలో మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్‌లో నోడల్ అధికారులతో సమీక్ష జరిగింది. సర్వేలో అర్హులైన తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుదారులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంటుందన్నారు.
అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, వ్యవసాయ విస్తీర్ణాధికారులు నిర్వహించే సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్, ప్రత్యేక మండల అధికారులను నియమించి తహశీల్దార్లు, ఎంపీడీఓలకు సైతం బాధ్యతలు అప్పగించడం జరిగింది. ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను సమగ్ర పరిశీలన అనంతరం వనపర్తి జిల్లాలో 6647 దరఖాస్తులు తుది పరిశీలనకు రావడం జరిగింది, వీటిని జనవరి 16 నుండి 20 వ తేదీ వరకు జరిగే సర్వేలో నిర్ధారించడం తదుపరి 21 నుండి 24 వరకు జరిగే గ్రామసభలపై తీర్మానం చేయవలసి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ళకై 142075 మంది దరఖాస్తు చేసుకోగా ఇంటింటి సర్వే అనంతరం వనపర్తి జిల్లాలో 36206 మంది దరఖాస్తులు తుది జాబితాలో వచ్చాయని, తుది జాబితాలో వచ్చిన దరఖాస్తుదారుల వివరాలను జనవరి 16 నుండి 20 వరకు క్షేత్ర స్థాయి సర్వేలో మరోమారు పరిశీలించి గ్రామ సభలో పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. వ్యవసాయ భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం జిల్లాలో 121844 జాబ్ కార్డు ఉండగా 2023-24 సంవత్సరాల్లో కనీసం 25 రోజులు ఉపాధిహామీ పథకంలో పని చేసి కుటుంబం లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం చేస్తారు.
వనపర్తి జిల్లాలో ఇలాంటి కుటుంబాలు 49,354 ఉన్నట్లు రాష్ట్ర నివేదికలో గుర్తించడం జరిగింది, ఈ నాలుగురోజుల సర్వేలో అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ యోగ్యత కలిగిన భూములను గుర్తించి రైతు భరోసా ఇచ్చేందుకు మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో జనవరి 16 నుండి 20 వరకు జరిగే సర్వేలో వ్యవసాయ యోగ్యం లేని భూముల ఇళ్ల స్థలాలు, లే అవుట్లు, భూసేకరణ చేసిన స్థలాలు, ఎండోమెంట్ భూములు గుర్తించి నివేదికను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అదనపు లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, రైతు భరోసా నోడల్ అధికారి గోవింద్ నాయక్, రేషన్ కార్డుల నోడల్ అధికారి కాశి విశ్వనాథ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నోడల్ అధికారి ఉమాదేవి, ఇందిరమ్మ ఇళ్లు అధికారి నోడల్ విటోబా, జడ్పీ సి. ఈ ఓ యాదయ్య, డి.పి. ఓ, కొత్తకోట మునిసిపల్ కమీషనర్ పవన్ సురేష్ నియమించబడ్డాడు.