Home సినిమా రజాకార్ల రాక్షస పాలనను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

రజాకార్ల రాక్షస పాలనను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

by Admin_swen
0 comment



  • తెలంగాణ తెగువను, పటేల్ కృషి ని తెలియజేసిన మూవీ
  • కేసీఆర్… ఈ సినిమా చూశాక నిజాం గొప్పోడని ట్వీట్ చేస్తే దమ్ముందా?
  • ముస్లిం రిజర్వేషన్లు కావాలంటున్న కాంగ్రెస్ నేతలు ఈ సినిమా చూడండి
  • రజాకార్ మూవీ చూసి ఒవైసీ పార్టీ ఏట్లాంటిదో తెలుసుకోండి
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముద్రణ ప్రతినిధి : నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను, గోసను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ”రజాకార్”. నిజాం నియంత, రజాకార్ల రాక్షసత్వ పాలనపై తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల చరిత్రను అద్బుతంగా తెరపై చూపించారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. ఆదివారం రజాకార్ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలకు విమోచన కల్పించి మనమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిది. ఈ వాస్తవాలను నేటి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలంటే మంచి ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు కల్పించినా వాటిని అధిగమించి సినిమాను అత్యద్భుతంగా తీసి ప్రజలకు దర్శక, నిర్మాతలు యాట సత్యనారాయణ, గూడూరు నారాయణరెడ్డిలకు నిజమంగా హ్యాట్సాఫ్ అన్నారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను కళ్లారా చూపించాం. పరకాల, గుండ్రాంపల్లి వంటి గ్రామాల ప్రజల పోరాట స్ఫూర్తిని ఈ సినిమాలో చూపించారని కొనియాడారు.

కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాక ‘రజాకార్’ లాంటి సినిమా తీయాలనే ఆలోచనను నిర్మాత గూడూరు నారాయణరెడ్డితో నేను పంచుకున్నా… అనుకున్నదే తడువుగా దర్శకుడు యాట సత్యానారాయణతో స్క్రిప్టును పూర్తి చేసి ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించడం చాలా గ్రేట్. సినిమా నిర్మాణ సమయంలో, ఆ తరువాత సినిమా విడుదల సమయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆర్దికంగా ఇబ్బందులు పడ్డా వాటిని దాటుకుంటూ ఈ సినిమా ప్రజలకు చేరవేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్బుతంగా నటించారు. ఖాసీంరాజ్వీ, రాజిరెడ్డి, సర్దార్ పటేల్ పాత్రల్లో నటించాలనే దానికంటే జీవించారని చెప్పొచ్చు. అందుకే మనస్పూర్తిగా సినిమా యూనిట్ సభ్యులందరికీ మనస్పూర్తిగా అభినందనలు తెలియజేసారు. పేరుకోసమో, డబ్బు కోసమో కాకుండా వాస్తవాలను, తెలంగాణలో నాడు ప్రజలు పడ్డ గోసను, ఆనాటి చరిత్రను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో కష్టాలను ఓర్చి సినిమాను నిర్మించిన దర్శక, నిర్మాతలకు నా ప్రత్యేక అభినందనలు.

దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు, కొందరు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను ప్రోత్సహించడం లేదు. సినిమా థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారు. దయచేసి వీటిని వెంటనే చెక్ పెట్టి ఇలాంటి సందేశాత్మక సినిమాల ప్రదర్శనకు అనుమతించాలి. ప్రజలు చూసేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బాధాకరమేందంటే…. ఒక మత వ్యాప్తి కోసం నిజాం, రజాకార్ ఎన్ని అరాచకాలు చేశారో కళ్లారా చూసిన తరువాత కూడా కాంగ్రెస్ పాలకులు ఇంకా ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తాననడం సిగ్గు చేటు. అందుకే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే మా అభిమతం అని స్పష్టం చేశారు.కొందరు కుహానా లౌకిక వాదులు, నిజాం సమాధి ఎదుట మోకరిల్లిన కేసీఆర్, ఒవైసీ వంటి నేతలందరికీ ఈ సినిమా చూపించాలి. ఎందుకంటే నిజాం చేసిన అరాచకాలను, రజాకార్ రాక్షసత్వం వాళ్లకు తెలియాలి. ఏ నోటితో నిజాంను కేసీఆర్ పొగిడారో ఈ సినిమా చూసిన ఆ నోటితో సినిమా గురించి ట్వీట్లు చేయాలని డిమాండ్ చేశారు.ఇది బీజేపీ కార్యకర్తలు చూడాల్సిన సినిమా కాదు… తెలంగాణ చరిత్రలను తెలుసుకోవాలనే వాళ్లు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన సినిమా.

ప్రత్యేకించి యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను…. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. సినిమా చూసిన తరువాత ట్వీట్ చేయాలి. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలి. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ, దేశంలోని హిందూవులందరూ ఈ సినిమా చూడాలని ఉన్నారు.
కేసీఆర్ ఎక్కడున్నా ఆయన ‘రజాకార్’ సినిమా చూడాలని కోరుతున్నా. ఆ సినిమా చూసిన తరువాత కూడా నిజం గొప్పోడు, రజాకార్లు మంచోళ్లని అన్పిస్తే నిరభ్యంతరంగా కేసీఆర్ ‘ట్వీట్’ చేయొచ్చు. అవసరమైతే ఆనాడు నిజాం సమాధి ముందు మోకరిల్లిన కేసీఆర్ ఫొటోను కూడా ఈ సినిమా చూసిన తరువాత ట్వీట్ చేయమని సూచిస్తున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. రజకార్ల వారసుల పార్టీ మజ్లిస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఇంకా కొనసాగుతారా? లేదా? ఆలోచించండి. అట్లాగే కేసీఆర్తోపాటు రజాకార్ల పార్టీ అయిన మజ్లిస్ వారసులందరినీ పాతబస్తీలోని చార్మినార్ వద్ద రజాకార్ సినిమా చూపించాలని చెప్పారు.

You may also like

Leave a Comment

Swendaily.com delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech