Home అంతర్జాతీయం ఆ రెండు పాటలు విడుదల చేయకముందే… అనుమానాస్పద మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

ఆ రెండు పాటలు విడుదల చేయకముందే… అనుమానాస్పద మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Swen Daily

by Admin_swen
0 comment
 ఆ రెండు పాటలు విడుదల చేయకముందే... అనుమానాస్పద మృతి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • దక్షిణ కొరియా పాప్ సింగర్ పార్క్ బో రామ్ కన్నుమూత

సియోల్: దక్షిణ కొరియా దేశానికి చెందిన ప్రముఖ పాప్ సింగర్ పార్క్ బో రామ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఒక రెస్ట్ రూంలో సింక్ వద్ద ముఖం కడుక్కుంటూ అలాగే తూలి పడిపోయినట్టుగా ప్రాణాలు వదిలారు. అందమైన రూపం, అంతే అందమైన కంఠస్వరంతో పదేళ్లుగా ఆమె దక్షిణ కొరియా వాసులను తన గానామృతంతో ఉర్రూతలూగిస్తున్నారు. మూడు పదుల వయసులోనే ఆమె మరణించారన్న వార్తను దక్షిణ కొరియాలోని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె పాప సింగర్ గా పదేళ్లు పూర్తికావస్తున్న సందర్భంలో గౌరవసూచకంగా ఈ ఏడాది చివరిలో రెండు కొత్త పాటలను విడుదల చేస్తానని, కొద్ది రోజుల క్రితమే ప్రకటన. ఆ రెండు పాటలు విడుదల చేయకముందే ఆమె శాశ్వతంగా వెళ్లిపోయారు. నమ్యంగ్జు పోలీస్ స్టేషన్ అధికారులు దాని ప్రకారం ఆమె చనిపోయేందుకు కొద్ది గంటల ముందు ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో ఉంది. అక్కడ ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత రాత్రి 9.55 గంటలకు ఆమె రెస్ట్ రూమ్ కు వెళ్లారు. అక్కడ సింక్ పై వంగి అపస్మారక స్థితిలో చనిపోయి వుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Swendaily.com delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech